కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా డార్లింగ్ ప్రభాస్ తో భేటీ కానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగనున్న విషయం తెలిసిందే. కాగా ఆ వేడుకలలో పాల్గొనడానికి ఈరోజు సాయంత్రం అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఈరోజు ఇక్కడే బస చేయనున్నారు. రేపు సెప్టెంబర్ 17 న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకలలో పాల్గొననున్నారు.
అయితే ఆ వేడుకల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అలాగే వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు. దాంతో కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించడానికి ఇలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీ తెలంగాణలో బలోపేతం కావాలని చూస్తోంది. అందులో భాగంగానే వరుసగా సినిమా హీరోలతో సమావేశం అవుతున్నారు బీజేపీ నాయకులు. ఇక ఆకోవలోనే ప్రభాస్ తో కూడా భేటీ జరుగనున్నట్లు సమాచారం.