త్వరలోనే ప్రభాస్ – అనుష్క ల పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు మరణించడంతో బహుశా వచ్చే ఏడాది అనుష్క – ప్రభాస్ ల పెళ్లి కానున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ప్రభాస్ – అనుష్క ల పెళ్లి వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. అలాగే ఆ వార్తలను అటు ప్రభాస్ ఇటు అనుష్క ఖండిస్తూనే ఉన్నారు.
ఇలా ఎన్నిసార్లు ఖండన ఇస్తున్నప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. కృష్ణంరాజు ప్రభాస్ – అనుష్కల పెళ్ళికి అడ్డుగా ఉన్నాడనే వార్తలు వినిపించాయి అప్పట్లో. ప్రభాస్ పెళ్లి చేయాలని కృష్ణంరాజు అనుకున్నాడు కానీ అనుష్కతో కాదనే మాటలు వినిపించాయి. అందుకే ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు. ఇక అనుష్క కూడా వయసు మీద పడుతున్నప్పటికీ పెళ్లి చేసుకోలేదు.
ఇప్పుడు కృష్ణంరాజు లేడు కాబట్టి ప్రభాస్ – అనుష్క ల పెళ్లి అవ్వడం ఖాయమని వినిపిస్తోంది. అంతేకాదు పలువురు ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు ఫిలిం నగర్ సర్కిల్లో. ఇక అనుష్క చేస్తున్న సినిమాలు కూడా గతకొంత కాలంగా కేవలం యువీ క్రియేషన్స్ సంస్థకు మాత్రమే చేస్తోంది. యువీ క్రియేషన్స్ ప్రభాస్ అన్నయ్య అలాగే ప్రభాస్ మిత్రులతో కలిసి ఏర్పడిన సంస్థ అనే విషయం తెలిసిందే. ప్రభాస్ – అనుష్క ల పెళ్లి అయితే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా మంచి ఈడు జోడు అనే సంగతి తెలిసిందే.