డార్లింగ్ ప్రభాస్ ను అమితంగా ఇష్టపడే అభిమానులు కోట్లాది మంది. అయితే అలాంటి అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు ఓ జ్యోతిష్యుడు. ప్రభాస్ కు 2025 వరకు చాలా గడ్డు సంవత్సరం అని చెప్పేసాడు. ఏడేళ్ల పాటు ప్రభాస్ కు కష్టాలు వస్తాయని, ఇది 2018 నుండి శని మొదలైందని ……. ఏడేళ్ల పాటు అంటే 2025 వరకు ఇది కొనసాగుతుందని అంటున్నాడు. ఈ ఏడేళ్ల పాటు ప్రభాస్ కు పెళ్లి మీద ధ్యాస ఉండదని, అలాగే డబ్బు మీద కూడా వ్యామోహం తగ్గుతుందని దాంతో దేని గురించి పెద్దగా పట్టించుకోడని అంటున్నాడు.
గతంలో కూడా పలువురు జ్యోతిష్యులు ఇదే విషయాన్ని చెప్పారు. ప్రభాస్ కు కష్టకాలం నడుస్తోందని అంటున్నారు. వాళ్ళు చెప్పినట్లుగానే బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు యావత్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపాయి. అయితే ఆ తర్వాత వచ్చిన సాహూ , రాధే శ్యామ్ చిత్రాలు ఘోర పరాజయాన్ని చవి చూశాయి.
ప్రభాస్ ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేస్తున్నాడు. 2025 వరకు అంటే చాలా గడ్డుకాలం అనే చెప్పాలి. ఆదిపురుష్ చిత్రం 2023 జనవరి 12 న భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొమ్మల సినిమా లాగా ఉందని అంటున్నారు. దాని తర్వాత సలార్, ప్రాజెక్ట్ – K చిత్రాలు విడుదల కానున్నాయి. వాటి పరిస్థితి ఏంటో కానీ 2025 వరకు మాత్రం ప్రభాస్ కు గడ్డుకాలమనే అంటున్నారు జ్యోతిష్యులు.