
డార్లింగ్ ప్రభాస్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో తరచుగా అనారోగ్యానికి గురౌతున్నాడు ప్రభాస్. జ్వరంతో పాటుగా ఇతర సమస్యలతో బాధపడుతుండటంతో తరచుగా సినిమా షూటింగ్ లను వాయిదా వేయాల్సి వస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ మళ్ళీ అనారోగ్యానికి గురయ్యాడని దాంతో చికిత్స కోసం ఫారిన్ వెళ్లినట్లు తెలుస్తోంది.
గతకొంత కాలంగా ఇదే సమస్యతో బాధపడుతున్నాడు ప్రభాస్. హెల్త్ చెకప్ కోసం తరచుగా ఫారిన్ వెళ్తున్నాడు. ఇప్పుడు మరోసారి ఫారిన్ బాట పట్టాడు. దాంతో మా హీరో ప్రభాస్ కు ఏమైంది ? జనరల్ హెల్త్ చెకప్ కోసమే వెళ్లాడా ? ట్రీట్ మెంట్ కోసం వెళ్లాడా ? అంటూ ఆందోళన చెందుతున్నారు డార్లింగ్ అభిమానులు.
ప్రభాస్ తాజాగా సలార్ , ప్రాజెక్ట్ – K , మారుతి సినిమా , ఆదిపురుష్ చిత్రాలు చేస్తున్నాడు. ఆదిపురుష్ ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జూన్ లో విడుదల కానుంది. అయితే సలార్ , ప్రాజెక్ట్ -కె , మారుతి చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి వాటిని పూర్తి చేయాల్సి ఉంది. వాటి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రం చేయనున్నాడు.