పెద్ద నాన్న కృష్ణంరాజు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రభాస్ ఈనెలలో షూటింగ్ లో పాల్గొనకపోవచ్చని , అందుకే షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు కాస్త సడలించి కొత్త డేట్స్ చూసుకోవాలని ప్రభాస్ టీమ్ ముందుగా చెప్పిందట ఆయా దర్శక నిర్మాతలకు. దాంతో అలాగే అనుకున్నారు. అయితే ప్రభాస్ మాత్రం పెద్దనాన్న పెద్ద కర్మ కాగానే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
దాంతో యూనిట్ వర్గాలు షాక్ అయ్యాయి. పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రభాస్ ఈనెలలో షూటింగ్ కి రావడం కష్టమే అనుకుంటే ……. అలా పెద్ద కర్మ కాగానే ఇలా షూటింగ్ కి వచ్చేసాడు దాంతో సలార్ యూనిట్ తీవ్ర సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ప్రస్తుతం సలార్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.
కెజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ గెటప్ కు అనూహ్య స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి. ఈ నెలాఖరు వరకు సలార్ షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది.