అగ్ర నిర్మాత డివివి దానయ్య ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. అయితే ఆ దర్శకుడు సరిగ్గా తీయగలడా ? అనే భయం పట్టుకుందట. దాంతో ప్రభాస్ నిర్మాత చాలా భయపడుతున్నాడట. అంతేకాదు నాకు ఈ సినిమా ఏమి వద్దు …… ఎవరైనా ముందుకు వస్తే వాళ్లకు ఆ ప్రాజెక్ట్ అప్పగిస్తానని చూస్తున్నాడట.
ఆర్ ఆర్ ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని నిర్మించాడు డివివి దానయ్య. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ప్రభాస్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. అంతేకాదు 50 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. ఇక ప్రభాస్ తో చేసే సినిమాకు మారుతి దర్శకుడు అని అనుకున్నాడట. ఓ హర్రర్ కథ చెబితే తక్కువ రోజుల్లోనే అయిపోతుంది కదా ! అని ఒప్పుకున్నాడట. అయితే మారుతి దర్శకత్వంలో వచ్చిన ” పక్కా కమర్షియల్ ” డిజాస్టర్ అయ్యింది. దాంతో దానయ్య పునరాలోచనలో పడ్డాడట.
అసలే ప్రభాస్ నటించిన కొన్ని చిత్రాలు ఇటీవల ఘోర పరాజయం పొందాయి. అయినా మంచి మార్కెట్ ఉంది కాబట్టి ధైర్యం చేయచ్చు అనుకుంటే మారుతి ట్రాక్ రికార్డ్ ఏమి బాగోలేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని చూస్తున్నాడట. ఎవరైనా నిర్మాత ముందుకు వస్తే ఈ ప్రాజెక్ట్ ని వాళ్లకు అప్పగించి నా డబ్బులు నేను తీసుకుంటాను అని చూస్తున్నాడట. మరి ఏమౌతుందో ……. ఏంటో పాపం.
Breaking News