Prabhas Project K” యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికి అన్నిటికంటే బాగా క్రేజ్ పెరిగిపోతున్న మూవీ ”ప్రాజెక్ట్ కే”.. ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో ఈ క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. సైన్స్ ఫిక్షన్ మూవీగా నాగ్ అశ్విన్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
అయితే ఈ సినిమా ప్రకటించారు కానీ ఇంత వరకు పెద్దగా అప్డేట్స్ ఇచ్చింది లేదు.. నాగ్ అశ్విన్ ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా ప్రకటించినప్పుడు ”ప్రాజెక్ట్ కే” అనే వర్కింగ్ టైటిల్ ను అనౌన్స్ చేసారు. అప్పటి నుండి ప్రాజెక్ట్ కే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉంటున్నారు.
ఎట్టకేలకు జులై 20న ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ రాబోతుంది.. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రాజెక్ట్ కే అంటే అర్ధం ఏంటో ఈ టీజర్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ అండ్ టైటిల్ డేట్ అండ్ టైం ఫిక్స్ చేస్తూ అధికారికంగా పోస్ట్ చేసారు మేకర్స్.
ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ శాన్ డియాగో కామిక్ కామ్ లో పాల్గొనబోతున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ కే రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.. మరి ఇదే ఈవెంట్ లో మేకర్స్ ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. యూఎస్ లో జులై 20న రిలీజ్ చేయగా మన ఇండియన్ టైం ప్రకారం జులై 21న ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ ఫస్ట్ ప్రోమో అందుబాటులోకి వస్తుంది.
500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న వైజయంతీ మూవీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండగా ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక రోల్స్ లో నటిస్తున్నారు.. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.