
డార్లింగ్ ప్రభాస్ సమంత పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. సమంత , దీపికా పదుకొనె ఇద్దరు కూడా నీళ్లలో పడిపోతే సమంతను కాపాడనని …… దీపికా పదుకోన్ నాకు ముఖ్యమని ఆమెనే కాపాడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు డార్లింగ్ ప్రభాస్. దీపికా పదుకోన్ ని ఎందుకు కాపాడతానో చెప్పాలా …… ఎందుకంటే ఆమె నదిలో కొట్టుకుపోతే నా ప్రాజెక్ట్ – K సినిమా ఆగిపోతుంది కదా ! అంటూ నవ్వాడు డార్లింగ్.
సమంత , దీపికా లను కాపాడటం ఏంటి ? అని అనుకుంటున్నారా ? నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ ప్రశ్న వేసాడు…… అన్ స్టాపబుల్ షో కోసం. బాహుబలి ప్రభాస్ తో బాలయ్య ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ 2 షో కోసం ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేసాడు బాలయ్య. ఇక దీన్ని రెండు భాగాలుగా చేయగా తాజాగా రెండో భాగం కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ ఎపిసోడ్స్ రెండు కూడా బ్లాక్ బస్టర్ గా మారాయి.
ఇక అందులో భాగంగానే బాలయ్య అడిగిన కొంటె ప్రశ్నకు అంతే కొంటెగా సమాధానం ఇచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ – K చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమాలో దీపికా హీరోయిన్ అనే విషయం తెలిసిందే. ఇక సమంత – ప్రభాస్ ల కాంబినేషన్ లో ఇంతవరకు సినిమా రాలేదు. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ఆశపడుతున్నారు డార్లింగ్ అభిమానులు.