
డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త ……. వర్షం చిత్రాన్ని మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఈనెల 23 న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్ సీస్ లో కూడా వర్షం చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో పలువురు స్టార్ హీరోల చిత్రాలను మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అలా బాలయ్య నటించిన చెన్నకేశవ రెడ్డి , పవన్ కళ్యాణ్ నటించిన జల్సా , మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రాలు విడుదల అయ్యాయి. అలాగే భారీ వసూళ్లను సాధించాయి. ఆ సినిమాలు ఇచ్చిన జోష్ తో పలువురు స్టార్ హీరోల చిత్రాలను మళ్ళీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆ కోవలోనే ప్రభాస్ – త్రిష జంటగా నటించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం వర్షం చిత్రాన్ని అక్టోబర్ 23 న అలాగే 24 న పలు థియేటర్ లలో ప్రదర్శించనున్నారు. 2004 లో విడుదలైన వర్షం వసూళ్ల వర్షం కురిపించింది. ప్రభాస్ ను హీరోగా నిలబెట్టిన చిత్రం వర్షం. ఈ సినిమాలో సూపర్ హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ ని అలరించడానికి వర్షం చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు.