
శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్ టాక్ బయటకు వచ్చింది. వివాదాస్పద రివ్యూ రైటర్ ఉమైర్ సంధు ప్రిన్స్ మూవీ ఆకట్టుకునేలా లేదని తేల్చిచెప్పాడు. కొత్త సీసాలో పాత సారా పోసినట్లుగా ఉందని కామెంట్ చేసాడు. దాంతో శివ కార్తికేయన్ అభిమానులు ఉమైర్ సంధు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జాతిరత్నాలు వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన అనుదీప్ ఈ ప్రిన్స్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దాంతో ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఉక్రెయిన్ భామ మారియా హీరోయిన్ గా నటించడం విశేషం.
ప్రిన్స్ తెలుగు , తమిళ భాషల్లో అక్టోబర్ 21 న విడుదల కానుంది. అంటే రేపు ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఉమైర్ సంధు ఇచ్చిన రేటింగ్ శివ కార్తికేయన్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అయితే ఆ రివ్యూ రైటర్ బాగున్నాయి అనే సినిమాలు అంతగా ఆడలేదు. బాగోలేవని అన్న సినిమాలు హిట్ అయినవి కూడా ఉన్నాయి. అతడి అభిప్రాయం పక్కన పెడితే అసలు తీర్పు రేపు వెలువడనుంది.