సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం ” జైలర్ ”. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమానుండి ప్రియాంక అరుళ్ మోహన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు కానీ ఈ భామ మాత్రం మొహమాటం లేకుండా తప్పుకుందట. దాంతో హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం.
అయితే ఇలా ఆ సినిమా నుండి తప్పుకోవడానికి కారణం ఏంటి ? అని ఆరా తీయగా దర్శకుడు నెల్సన్ తో ప్రియాంకకు వచ్చిన విబేధాలే కారణమని తెలుస్తోంది. గతంలో నెల్సన్ దర్శకత్వంలో డాక్టర్ అనే సినిమాలో నటించింది ఈ భామ. ఆ సినిమా తెలుగు , తమిళ భాషల్లో పెద్ద హిట్ అయ్యింది. సినిమా హిట్ అయ్యింది కానీ షూటింగ్ సమయంలో నెల్సన్ వ్యవహరించిన తీరుకు ప్రియాంక అరుళ్ మోహన్ చాలా బాధపడిందట.
అందుకే జైలర్ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక మోహన్ తప్పుకోవడంతో ఆ పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేశారట. ఇంకేముంది రజనీకాంత్ సినిమా కాబట్టి బల్క్ డేట్స్ ఇచ్చేసిందట తమన్నా. గతకొంత కాలంగా తమన్నా సక్సెస్ కొట్టలేకపోతోంది. దాంతో జైలర్ పై భారీగా ఆశలు పెట్టుకుంది. మరి ఈ జైలర్ ఏమౌతుందో చూడాలి. రజనీకాంత్ కు కూడా చాలాకాలంగా సరైన హిట్ లేదు మరి.