చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత మధు మంతెన తండ్రి మురళీ రాజు (70) మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మధు మంతెన తండ్రి ఈరోజు ఉదయం హైదరాబాద్ లో మరణించారు. దాంతో మధు మంతెన తండ్రికి నివాళులు అర్పించడానికి హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ సమీపంలోని మధురానగర్ లోగల మధు మంతెన ఇంటికి చేరుకున్నారు.నిర్మాత అల్లు అరవింద్ , బన్నీ వాసు తదితరులు మంతెన మురళీ రాజుకు నివాళులు అర్పించారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ముంబై నుండి హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని నివాళులు అర్పించారు.
నిర్మాత మధు మంతెన తెలుగులో అలాగే హిందీ మరియు బెంగాలీ బాషలలో పలు చిత్రాలను నిర్మించాడు. హిందీలో గజినీ చిత్రాన్ని అల్లు అరవింద్ తో కలిసి మధు మంతెన నిర్మించారు. అల్లు అరవింద్ కుటుంబంతో మధు కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో ఆయన్ని ఓదార్చడానికి అల్లు అరవింద్ , అల్లు అర్జున్ మధు ఇంటికి వెళ్లారు. మంతెన మురళీ రాజు ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ కు మేనమామ అవుతారు.