
అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఫిలింనగర్ లో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుందనే విషయం తెలిసిందే. ఈ ట్రాఫిక్ జామ్ ను కాస్త కంట్రోల్ చేయాలని భావించిన ట్రాఫిక్ పోలీసులు దారుణమైన యు టర్న్ లను ఏర్పాటు చేసారు. ఈ నిర్ణయం వల్ల ట్రాఫిక్ పోలీసుల తీరుపై దారుణమైన విమర్శలు వచ్చిపడుతున్నాయి.
ఫిలింనగర్ లో ట్రాఫిక్ దారుణంగా జామ్ అవుతుండటంతో అదే దారిలో ప్రయాణిస్తున్న నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు దిగి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసాడు. ఎవరి దారిలో వాళ్ళు వెళ్లేలా ……. అందరినీ మార్గదర్శనం చేసాడు సురేష్ బాబు. ఇక సురేష్ బాబు లాంటి నిర్మాత చొరవ తీసుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేయడం నెటిజన్లను ఆకర్షిస్తోంది. సురేష్ బాబు ట్రాఫిక్ జామ్ కాకుండా సూచనలు ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.