
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ అడవి రాముడు. ఆ చిత్రాన్ని నిర్మించిన సూర్యనారాయణ ఈరోజు అనారోగ్యంతో మరణించారు. వయోభారంతో కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యనారాయణ ఈరోజు తుదిశ్వాస విడిచారు. 1977 లో విడుదలైన అడవి రాముడు ప్రభంజనం సృష్టించింది. అంతకు ముందు అలాగే ఆ తర్వాత కూడా పలు చిత్రాలను నిర్మించారు. అయితే ఎన్ని హిట్స్ ఉన్నప్పటికీ అడవి రాముడు నిర్మాతగా ఎనలేని కీర్తి ప్రతిష్టలను పొందాడు. సూర్యనారాయణ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.