హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల థాయిల్యాండ్ విద్యార్థిని పై 62 ఏళ్ల హిందీ ప్రొఫెసర్ అత్యాచారయత్నం చేసాడు. దాంతో ఆ స్టూడెంట్ ప్రొఫెసర్ నుండి తప్పించుకొని గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన సంఘటనను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రొఫెసర్ నిరంజన్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు విద్యార్థులు. ఈ సంఘటన హైదరాబాద్ మహానగరంలో సంచలనం సృష్టించింది.