praject k నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రాజెక్ట్-కే’. మల్టీ స్టారర్ సినిమాగా దీన్నితెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పటికే ఇందులో బిగ్ బీ నటిస్తున్నాడని అఫీషియల్ గా అనౌన్స్ రాగా, కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకోన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
బాలీవుడ్ లో దీపికా పదుకోన్ ముందు వరుసలో ఉన్న హీరోయిన్. ప్రస్తుతం ఆమెకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇటీవల షారూక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాలో ఆమె కనిపించింది. బాలీవుడ్ బాద్ షా బిగ్ బీ లాంటి వారు సైతం ఆమెను ప్రశంసిస్తూ ఉంటారు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్, చిత్రీకరణకు భారీగా ఖర్చు పెడుతున్నారట మేకర్స్.
షెడ్యూల్ లో భాగంగా షూటింగ్ కోసం మేకర్స్ ఇటీవల యూఎస్ఏ వెళ్లారు. అక్కడ ఉన్న శాన్‌డిగోలో షూటింగ్ స్పాట్లను పరిశీలించారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ ట్విటర్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. జూలై 20వ తేదీ (గురువారం) నుంచి అక్కడ షూటింగ్ మొదలు పెడుతున్నట్లు బ్యానర్ తెలిపింది. అయితే కొన్ని ఫైట్స్ సీన్స్ ఈ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కీలక పాత్రలో కమల్ హాసన్
ఇటీవల కమల్ హాసన్ కూడా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించేందుకు చాలా ఇంట్రస్ట్ చూపుతున్నట్లు టాక్ ఉంది. ఆయన తోటి నటులు బిగ్ బీ వంటి వారు ఆయనను ఈ ప్రాజెక్ట్ లోకి స్వాగతించారు. పలు మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన విలన్ గా కనిపిస్తున్నారట. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా చెప్పారు. ఇప్పటికే బిగ్ బీ ఈ సినిమాలో నటిస్తుండగా కమల్ ఎంట్రీని అమితాబ్ స్వాగతించారు.
The men have landed in the USA 🇺🇸. See you in San Diego on July 20th.#Prabhas @RanaDaggubati #ProjectK #WhatisProjectK pic.twitter.com/lclZRo4Srp
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2023