
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి అప్పుడే ఏడాది కాలం అయ్యింది. 2021 అక్టోబర్ 29 న ఉదయం వ్యాయామం చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పునీత్ రాజ్ కుమార్. దాంతో ముందుగా తన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఏదో ఉపద్రవం రాబోతోంది అనే అనుమానంతో వెంటనే ఓపెద్ద ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే పునీత్ రాజ్ కుమార్ గుండె ఆగిపోయింది. దాంతో కర్ణాటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పునీత్ రాజ్ కుమార్ ఇక లేడు అనే వార్త అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది. దాంతో కొంతమంది వీరాభిమానుల గుండెలు ఆగిపోయాయి. కర్ణాటక శోకసంద్రంలో మునిగింది. ఇంతమంది అంతగా బాధపడటానికి కారణం ఏంటో తెలుసా…… పునీత్ మంచి మనసు. ఎన్నో గుప్త దానాలు చేశారు పునీత్. అవన్నీ కూడా ఆయన మరణించిన తర్వాత మాత్రమే వెలుగులోకి వచ్చాయి. సరిగ్గా ఏడాది కిందట పునీత్ మరణించడంతో అతడ్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు అభిమానులు.