దర్శకులు పూరీ జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సాయికుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సాయికుమార్ అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసాడు కానీ అవకాశాలు దక్కలేదు. దానికి తోడు అప్పుల బాధ కూడా తోడవ్వడంతో మాదాపూర్ లోని దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
చెరువు లోకి దూకిన వ్యక్తి ఎవరని ఆరా తీయగా సాయి కుమార్ అని అతడు కొన్నాళ్ల క్రితం పూరీ జగన్నాథ్ దగ్గర పనిచేశాడని పోలీసుల విచారణలో తేలింది. సాయి కుమార్ కుటుంబానికి ఈ విషయాన్ని చేరవేశారు పోలీసులు. సినిమారంగంలో ఏదో సాధించాలని వచ్చిన సాయి కుమార్ అర్దాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది.