దర్శకులు పూరీ జగన్నాథ్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారట కొంతమంది బయ్యర్లు. దాంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యాడు పూరీ …… ఇంకేముంది బయ్యర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడట. తాజాగా పూరీ జగన్నాథ్ ఆడియో లీక్ అయ్యింది. ఈ ఆడియో ఫిలిం నగర్ సర్కిల్లో వైరల్ గా మారింది.
ఇటీవల పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ” లైగర్ ” అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 25 న పాన్ ఇండియా చిత్రంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. అయితే మార్నింగ్ షో నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది దాంతో ఈ సినిమాను కొన్న బయ్యర్లు దారుణంగా నష్టపోయారు.
బయ్యర్లకు భారీ నష్టాలు రావడంతో వాళ్లకు కొంత సర్దుబాటు చేస్తానని , నెల రోజులు గడువు కావాలని కోరాడట పూరీ జగన్నాథ్. దానికి బయ్యర్లు ఒప్పుకున్నారు. అయితే నెల దాటినా డబ్బులు ఇవ్వకపోవడంతో ధర్నా చేస్తాం ……. మీడియాకు ఎక్కుతాం అంటూ పూరీ జగన్నాథ్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారట కొంతమంది బయ్యర్లు.
ఇలా చేయాలని మీరు చూస్తే నేను భయపడే రకం కాదంటూ హెచ్చరించాడట. అంతేకాదు ధర్నాలు , గొడవలు చేస్తే ఒక్క పైసా కూడా ఇవ్వనని , ధర్నా చేయని వాళ్లకు మాత్రమే డబ్బులు ఇస్తానని స్పష్టం చేసాడట. దాంతో మరికొద్ది రోజులు ఎదురు చూద్దామనే ధోరణిలో ఉన్నారట బయ్యర్లు.