లైగర్ చిత్రం ప్లాప్ కావడంతో ఒక్కసారిగా పూరీ జగన్నాథ్ జాతకం తిరగబడింది. దాంతో లైగర్ ఆఫీస్ కోసం తీసుకున్న ఇంటిని ఖాళీ చేసాడట. అయితే అది ఇక్కడ హైదరాబాద్ లో కాదు సుమా ! ముంబైలో. లైగర్ పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన విషయం తెలిసిందే. కరణ్ జోహార్ – ఛార్మి సంయుక్తంగా లైగర్ చిత్రాన్ని నిర్మించారు.
అయితే లైగర్ పై భారీ అంచనాలు ఉండటంతో పెద్ద హిట్ అవుతుందని , ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయాలని అందునా ముంబై లో వరుస ఆఫర్లు వస్తాయని అనుకున్నాడు పూరీ జగన్నాథ్. అందుకే ముంబైలో నెలకు 15 లక్షలు పెట్టి మరీ ఆఫీస్ తీసాడు. ఇందులో 10 లక్షల రెంట్ కాగా మిగతా సొమ్ము మెయింటనెన్స్ కింద మరో 5 లక్షలు అంటే మొత్తానికి 15 లక్షలు అన్నమాట.
లైగర్ ప్లాప్ కావడంతో బయ్యర్లు పూరీ ఆఫీస్ మీద పడుతున్నారు. ఒకవైపు ఆ గోల ఉంటే మరోవైపు ఖర్చులు భరించలేనివిగా ఉండటంతో చేసేదిలేక ముంబైలోని ఆఫీసు ఖాళీ చేసాడట. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. కొద్దిరోజుల తర్వాత కానీ మిగతా విషయాల గురించి ఆలోచించేంత ఓపిక లేదన్న మాట.