లైగర్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని భావించి ఓటీటీ కి 200 కోట్ల ఆఫర్ వస్తే కాదనుకున్నారు. పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేసారు. అయితే ఈ సినిమా కు మిశ్రమ స్పందన వస్తోంది.
ఈ సినిమాని చూసిన వాళ్ళు ప్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసే వాళ్ళ విషయాన్ని పక్కన పెడితే విజయ్ దేవరకొండ అభిమానులు సైతం ఈ సినిమాని చూసి షాక్ అవుతున్నారు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు. టీజర్ , ట్రైలర్ ఇతర ప్రచారాలతో లైగర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం లైగర్ విఫలమయింది.
దాంతో విజయ్ దేవరకొండకు అలాగే దర్శకులు పూరీ జగన్నాథ్ కు ఈ సినిమా పెద్ద దెబ్బ కొట్టినట్లే అని అంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ ప్రత్యర్ధులు అయితే పండగ చేసుకుంటున్నారు. ఇంతగా ఓవర్ యాక్షన్ చేసినందుకు బాగానే అయ్యింది. సినిమా హిట్ అయ్యుంటే వాళ్ళ ఓవరాక్షన్ తట్టుకోలేకపోయేవాళ్లమని సంబరపడుతున్నారు.
Breaking News