
సినీ నటి పూర్ణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. పూర్ణ తల్లి అయిందనే వార్తతో ఆమె అభిమానులు సంతోషానికి గురవుతున్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు, మలయాళం, తమిళం సినిమాల ద్వారా నటిగా మంచి పేరు తెచ్చుకున్న పూర్ణ దుబాయ్ లో ఉన్న వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది.
కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పూర్ణకు పురుడు పోసిన వైద్యురాలు ఫాతిమా ఆమె బృందానికి పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. వైద్యబృందంతో పూర్ణ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేయగా ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బెడ్ పై బాబును ఎత్తుకొని .. తల్లిగా మధుర క్షణాలని ఆస్వాదిస్తోంది. ఈ సంబరాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది పూర్ణ.
లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసీఫ్ అలీని పెళ్లి చేసుకుంది పూర్ణ. ఆ తర్వతా కొద్దిరోజులకే తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. రీసెంట్ గా ఆమె సీమంతం వేడుకలు కూడా ఘనంగా నిర్వహించగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. ఇక పూర్ణ గర్బవతి అయినప్పటి నుంచి ఎన్నో ఫోటోలతో నెట్టింట్లో హడావిడి చేసింది పూర్ణ. రీసెంట్ గా రిలీజ్ అయిన నేచరల్ స్టార్ నానీ -కీర్తి సురేష్ మూవీలో కూడా విలన్ భార్యగా నటించింది పూర్ణ. తాజాగా తల్లైన పూర్ణ.. కన్నబిడ్డతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.






