
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప 2 చిత్రం షూటింగ్ జరుగుతుండటంతో ఆ నిర్మాణ సంస్థ పుష్ప 2 లొకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇంకేముంది ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలపై హీరోయిన్ రష్మీక మందన్న కూడా స్పందించింది.
పుష్ప మొదటి భాగం గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన పుష్ప లో అల్లు అర్జున్ డిఫరెంట్ గెటప్ , దేవిశ్రీప్రసాద్ సంగీతం , చంద్రబోస్ సాహిత్యం వెరసి పుష్ప ను బ్లాక్ బస్టర్ గా మలిచాయి. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో పుష్ప 2 ను మరింత లావిష్ గా చిత్రీకరిస్తున్నారు.
అల్లు అర్జున్ సరసన రశ్మిక మందన్న నటిస్తుండగా ఓ బాలీవుడ్ భామ చేత ఐటమ్ సాంగ్ చేయించాలనే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. ఇప్పటికే పాటలన్ని పూర్తయ్యాయి. పాటలు అన్ని కూడా చాలా బాగా వచ్చాయట. దాంతో వాటిని మరింత అందంగా చిత్రీకరించాలని భావిస్తున్నాడు సుకుమార్. అలాగే యాక్షన్ సీన్స్ కూడా మరింతగా ఆకట్టుకునేలా తీయాలని చూస్తున్నాడు. అనసూయ , సునీల్ , ఫహాద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.