అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప 2 చిత్రం వచ్చే ఏడాది 2023 ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట దర్శక నిర్మాతలు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప పార్ట్ 1 అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ మేనరిజం , యాక్షన్ , చంద్రబోస్ సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం , సుకుమార్ టేకింగ్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి.
పుష్ప చిత్రం సంచలనానికి కేంద్ర బిందువు కావడంతో పుష్ప 2 మరింత ఆలస్యం అయ్యింది. మోస్తారు విజయాన్ని సాధిస్తుందని అనుకుంటే బాక్సాఫీస్ ని కుమ్మేసింది దాంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకులు సుకుమార్. ఆమధ్య పుష్ప 2 ప్రారంభం కాగా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా ఇతర పాత్రల్లో అనసూయ , సునీల్ , ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు. అయితే కీలక పాత్రల్లో సాయి పల్లవి , ప్రియమణి కూడా నటించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి నటించడం లేదు అంటూ ఖండించినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇక రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయనున్నారట. ఏప్రిల్ లో ఎందుకంటే …… వేసవిలో సెలవులు ఉంటాయి కాబట్టి సినిమాకు కలెక్షన్ల పరంగా మరింత మంచిదనే అభిప్రాయంతోనేనట.