అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం పుష్ప 2. ఆమధ్య పుష్ప 2 షెడ్యూల్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా తాజాగా హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 12 సోమవారం రోజు నుండి పుష్ప 2 కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు దర్శకుడు సుకుమార్. ఇప్పటికే ఈ చిత్రంలోని అన్ని పాటలకు సాహిత్యం అందించాడు పాటల రచయిత చంద్రబోస్. అలాగే అన్ని పాటలకు కూడా సంగీతం అందించాడు దేవిశ్రీప్రసాద్. ఇక రెండో పార్ట్ లో కూడా ఐటమ్ సాంగ్ దద్దరిల్లి పోయేలా వచ్చిందట. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ , ఫహాద్ ఫాజిల్ , సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ ను ఏకంగా 350 కోట్లకు పెంచారట మొదటి భాగం ఇచ్జిన సక్సెస్ తో.