
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ” పుష్ప 2 ”. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే వైజాగ్ తదితర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. అయితే పుష్ప అనుకున్న స్థాయిలో వేగంగా షూటింగ్ జరగడం లేదు దాంతో అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. పుష్ప 2 అప్ డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు.
అయితే అలాంటి వాళ్లకు శుభవార్త ఎందుకంటే …… ఏప్రిల్ 8 న పుష్ప 2 అప్ డేట్ రానుంది. ఎందుకో తెలుసా ……. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పుష్ప 2 అప్ డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. పుష్ప 2 చిత్రాన్ని 2024 వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. మార్చిలో లేదంటే ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంగా విడుదల కానున్నట్లు సమాచారం.
అంటే పుష్ప 2 విడుదలకు ఏడాదికి పైగానే సమయం ఉందన్న మాట. పుష్ప ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకుడు సుకుమార్. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా కీలక పాత్రల్లో పలువురు నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. సునీల్ , అనసూయ , ఫహద్ ఫాజిల్ లకు రెండో పార్ట్ లో ఇంకా ఎక్కువ స్పేస్ ఉండనుందట. దాంతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా అనసూయ , సునీల్ ఇద్దరు కూడా.