
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని రష్యాలో కూడా విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర యూనిట్ రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, రష్మిక మందన్న , సుకుమార్ , దేవిశ్రీప్రసాద్ తదితరులు రష్యాలో కొద్ది రోజుల పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
డిసెంబర్ 8 న రష్యాలో భారీ ఎత్తున విడుదల చేసారు. ప్రచార కార్యక్రమాల్లో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. దాంతో తప్పకుండా మంచి ఓపెనింగ్స్ లభిస్తాయని భావిస్తున్నారు పుష్ప టీమ్. అల్లు అర్జున్ – రష్మిక మందన్న ల రొమాన్స్ , సమంత ఐటమ్ సాంగ్ , యాక్షన్ సీన్స్ వెరసి పుష్ప చిత్రాన్ని రష్యాలో కూడా సూపర్ హిట్ ని చేస్తాయని భావిస్తున్నారు. ఇండియాలో అదరగొట్టింది మరి రష్యాలో ఎలాంటి ఫలితాన్ని చవి చూస్తుందో కొద్ది గంటల్లోనే తేలనుంది.