36.9 C
India
Tuesday, April 21, 2026
More

    చిరు కోసం కుర్ర దర్శకుల క్యూ..!

    Date:

    Queue of boy directors for Chiru
    Queue of boy directors for Chiru

    మెగాస్టార్‌ చిరంజీవి దూకుడు మీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా మారాడు. ఓ పక్క ‘భోళాశంకర్‌ షూటింగ్‌ చేస్తూనే కొత్త కథలపై దృష్టిసారిస్తూ యువ హీరోలకు గట్టి పోటీగా నిలుస్తున్నాడు. పైగా మెగాస్టార్ తో సినిమా చేయడానికి యువ దర్శకులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. చిరు ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొత్త కథలతో క్యూ కడుతున్నారు. ఇప్పటికే ‘బింబిసారా’ ఫేం వశిష్ఠ ఓ స్టోరీతో మెప్పించారని.. ఆ కథ తుదిమెరుగుల్లో ఉందని టాక్‌ వినిపిస్తోంది. ఫాంటసీ కథతో కూడిన ఈ యాక్షన్‌ కథని యు.వి క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందని చిరు సన్నిహితుల నుంచి సమాచారం. ఇదిలా ఉండగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

    చిరుతో సినీయర్ డైరెక్టర్లతో పాటు కుర్ర దర్శకులు పోటీపడుతున్నారట. ఇప్పటికే యంగ్ డైరెక్టర్లు చిరు స్టోరీలు వినిపించగా.. మరికొంతమంది వినిపించే ప్రాసెస్‌లో ఉన్నారని టాక్‌. తమిళ దర్శకుడు పి.ఎస్‌.మిత్రన్‌తో చిరు ఓ సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్‌ విషయంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్‌ కురసాల కల్యాణ్‌కృష్ణ పేరు కూడా వినిపిస్తోంది.

    ఇదిలా ఉంటే.. ధమాకాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ప్రసన్నకుమార్ బెజవాడని ఒక కథ సిద్ధం చేయమని మెగాస్టార్ చెప్పారట. ఇలా ఈ జెనరేషన్ దర్శకులు రైటర్స్ కి మెగాస్టార్ కథలు సిద్ధం చేయమని సూచించడంతో పాటు వాటిలో ఒకటి సెలక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వరుస సినిమాలను లైన్ పెట్టడమేకాక అంతే స్పీడ్ గా ఫినీష్ చేస్తు… కుర్ర హీరోలకు రోల్ మోడల్ గా నిలుస్తున్నాడు మెగాస్టార్. అయితే ఈ నలుగురిలో చిరంజీవి ఎవర్ని ఫైనల్‌ చేస్తారో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Amaravati : అమరావతికి మెగాస్టార్ శోభ

    Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమం/పునఃప్రారంభోత్సవానికి...

    Singapore : పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులను సన్మానించిన సింగపూర్ ప్రభుత్వం

    Singapore : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్...

    Chiranjeevi : పవన్‌ కుమారుడి గాయాలపై స్పందించిన చిరంజీవి

    Chiranjeevi : పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలైన...