
ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కోరిక ఏంటో తెలుసా …… సూపర్ స్టార్ రజనీకాంత్ ని డైరెక్ట్ చేయాలని. అవును రజనీకాంత్ స్టైల్ కు కేరాఫ్ అడ్రస్. దాదాపు 70 ఏళ్ల వయసులో కూడా అదిరిపోయే స్టైల్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో రజనీకాంత్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ ని కుమ్మేయడం లేదు. దాంతో రజనీకాంత్ అభిమానులు బాక్సాఫీస్ బద్దలయ్యే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో ఎస్ ఎస్ రాజమౌళి చెన్నై వెళ్ళాడు. అక్కడ జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో రజనీకాంత్ ని డైరెక్ట్ చేయాలనేది నా జీవిత ఆశయమని స్పష్టం చేసాడు. రజనీకాంత్ ను కనీసం ఒక్క రోజైనా సరే డైరెక్ట్ చేయాలని ఉందని , ఆ అవకాశం కోసం ఎదురు చేస్తున్నానని తన మనసులోని కోరికను బయట పెట్టాడు.
రజనీకాంత్ – ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం. రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ నటించిన ప్లాప్ చిత్రం కూడా 200 కోట్లకు పైగా వసూల్ చేస్తుంది. అలాంటిది రాజమౌళి తోడైతే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయం. దాంతో రజనీకాంత్ అభిమానులు ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని కోరుకుంటున్నారు.