
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి చిత్రాన్ని చూసాడు సూపర్ స్టార్ రజనీకాంత్. అంతేకాదు వీరసింహారెడ్డి చిత్రం చాలా బాగుందని, సినిమాను అద్భుతంగా చిత్రీకరించారని , బాలయ్య గెటప్ కూడా అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారట రజనీకాంత్. దర్శకుడు గోపిచంద్ మలినేనికి రజనీకాంత్ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాలు చెప్పాడట. దాంతో రజనీకాంత్ లాంటి గొప్ప స్టార్ తనకు ఫోన్ చేసి మెచ్చుకోవడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
జనవరి 12 న విడుదలైన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గెటప్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇది రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలోని గెటప్ కు చాలా దగ్గరగా ఉంది. రజనీకాంత్ గెటప్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ వీరసింహారెడ్డి చిత్రం సూపర్ హిట్ కావడమే కాకుండా బాలయ్య గెటప్ కు కూడా అనూహ్య స్పందన వచ్చింది. దాంతో కాబోలు రజనీకాంత్ దర్శకుడు గోపిచంద్ మలినేనికి ఫోన్ చేసి అభినందించి ఉండొచ్చు.