నాపెళ్ళి గత ఏడాది నవంబర్ లోనే అయ్యింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ భామ గతకొంత కాలంగా జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో ఉంది. సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఎట్టకేలకు తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది. కట్ చేస్తే ఇటీవల కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ వార్తలతో విసిగిపోయిన రకుల్ ఎట్టకేలకు నాపెళ్ళి అయ్యింది. గత ఏడాది నవంబర్ లోనే మాపెళ్లి అయ్యింది. కాకపోతే ఆ పెళ్లి ఎలా అయ్యిందో మాత్రం నాకు తెలియదు అంటూ బాంబ్ పేల్చింది. అంటే ఈ భామ ఉద్దేశ్యం ఏంటంటే …… నా పెళ్లి విషయం నాకు తెలియకుండానే సోషల్ మీడియాలో చేస్తున్నారు అని చెప్పడమే ఈ భామ ఉద్దేశ్యం.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు , తమిళ భాషల్లో నటిస్తూ బాగానే బిజీగా ఉన్నప్పటికీ బాలీవుడ్ కు వెళ్లి జెండా పాతాలని ముంబై వెళ్ళింది. హిందీలో కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందలేదు. దాంతో ఈ భామ ఆశించిన స్టార్ డం అక్కడ అందుకోలేకపోయింది. ఇటు తెలుగు , తమిళ చిత్రాల్లో కూడా పెద్దగా అవకాశాలు లేకుండాపోయాయి. ఇంకేముంది ఖాళీగా ఉంది కదా ….. ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. దాంతో ఈ ఇద్దరి పెళ్లి అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే ఇలా స్పందించింది రకుల్ ప్రీత్ సింగ్.