వ్యాపార దిగ్గజం , మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా , తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ లతో సమావేశం అయ్యాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేసు జరుగనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. కాగా ఆ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం హైదరాబాద్ కావడంతో ఐటీ మరియు మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక ఇదే సమావేశంలో హీరో రాంచరణ్ పాల్గొనడం విశేషం.
హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కార్ రేసింగ్ ప్రారంభం అవుతోంది. దాంతో ఆ చుట్టుపక్కల ప్రదేశాలలో తీవ్ర ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఆంక్షలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్ రేసింగ్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. అన్ని రకాల పనులు కేటీఆర్ స్వయంగా నిర్వహిస్తుండటం విశేషం. ఇక సన్నాహాల కోసం నిర్వహించిన సమావేశంలో హీరో రాంచరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చరణ్ అయ్యప్ప మాల ధరించి ఉండటం విశేషం . చరణ్ చిన్నప్పటి నుండి తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి మాలధారణ చేస్తుంటాడు. అలా చరణ్ కు అయ్యప్పదీక్ష చిన్నప్పటి నుండే అలవటాయింది.