
ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ” లియో ”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా వినిపిస్తున్న కథనం మెగా అభిమానులను ఉప్పొంగిపోయేలా చేస్తోంది. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసా …… విజయ్ లియో చిత్రంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడని.
లోకేష్ కనగరాజ్ హీరోలను ఎంత అద్భుతంగా చూపించాలో అంతగా అద్భుతంగా చూపించి ప్రేక్షకులను మైండ్ బ్లోయింగ్ అయ్యేలా చేయగలడు. ఇక లోక నాయకుడు కమల్ హాసన్ ను ఎంత పవర్ ఫుల్ గా చూపించాడో అంతే పవర్ ఫుల్ గా అదే సినిమాలో నటించిన విజయ్ సేతుపతిని ఫహద్ ఫాజిల్ ను అలాగే చివర్లో సూర్య ను ఎంత పవర్ ఫుల్ గా చూపించాడో తెలిసిందే.
ఇక విజయ్ లియో సినిమాలో కూడా మెగా హీరో రాంచరణ్ ను అంతకుమించి పవర్ ఫుల్ గా చూపించనున్నట్లు సమాచారం. చరణ్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. చరణ్ ఎపిసోడ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని అంటున్నారు. అదే కనుక నిజమైతే ఇక మెగా అభిమానులకు ఈ వార్త మరింత సంతోషాన్ని ఇచ్చేదే అని చెప్పాలి.