మెగా పవర్ స్టార్ రాంచరణ్ అమెరికాలో సందడి చేసాడు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడంతో అందుకోసం ఫిబ్రవరి 20 న హైదరాబాద్ నుండి అమెరికాకు వెళ్ళాడు హీరో రాంచరణ్. ఇక ముందుగానే పలు కార్యక్రమాలు ఫిక్స్ కావడంతో 20 రోజుల ముందుగానే అమెరికా వెళ్ళాడు చరణ్. ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 12 న జరుగనుంది. అయితే అందుకోసం ముందుగానే అమెరికా వెళ్ళాడు.
ఇక అమెరికాలో అడుగుపెట్టిన చరణ్ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లోని Good Morning America ( GMA 3 ) కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు చరణ్. ఈసంస్థ అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అనే విషయం తెలిసిందే. GMA కోసం లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు చరణ్. ఇక ఈ లైవ్ షోకు చరణ్ వస్తున్నాడని తెలిసి పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. చరణ్ ను చూడటానికి పోటీ పడ్డారు. అందులో మన భారతీయులతో పాటుగా అమెరికా పౌరులు కూడా ఉండటం విశేషం. లైవ్ ఇంటర్వ్యూ ముగించుకొని న్యూయార్క్ నుండి లాస్ ఏంజెల్స్ కు వెళ్ళాడు చరణ్.