
హీరో రాంచరణ్ తన గొప్ప మనసు మరోసారి చాటుకున్నాడు. 9 సంవత్సరాల వయసున్న బాలుడు రాంచరణ్ కు వీరాభిమాని. చరణ్ అంటే అమితమైన ఇష్టం ఆ బాబుకు. అయితే గతకొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స పొందుతున్నప్పటికీ ఆ బాలుడి ఆరోగ్యంలో పెద్దగా మార్పులు లేకపోవడంతో అతడి దిగులు ఏంటా అని తెలుసుకున్నారు డాక్టర్లు అలాగే కుటుంబ సభ్యులు.
హీరో రాంచరణ్ ను చూడాలని ఆశగా ఉందని క్యాన్సర్ తో పోరాడుతున్న బాలుడు చెప్పడంతో ఈ విషయాన్ని మేక్ ఏ విష్ ఫౌండేషన్ వాళ్లకు తెలిపారు. వాళ్ళు హీరో రాంచరణ్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించాడు చరణ్. ఆ బాలుడ్ని చూడటానికి ఆసుపత్రికి వెళ్ళాడు. అంతేకాదు ఆ బాలుడికి ధైర్యాన్ని నూరిపోసాడు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. అలాగే ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. ధైర్యంగా ఉంటే తప్పకుండా కోలుకుంటావని ధైర్యం చెప్పాడు. ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.