మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో చరణ్ అడుగు పెట్టగానే పలువురు ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని కల్పించారు. క్లిక్ మనిపించారు …….. ఇంకేముంది ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి వైరల్ అయ్యేలా చేసారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో చరణ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిన విషయం తెలిసిందే.
ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ కోసం ఇటీవలే జపాన్ కూడా వెళ్ళొచ్చాడు. అక్కడ కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్రం అదరగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి చరణ్ చేసిన సినిమా ఆచార్య అట్టర్ ప్లాప్ అయ్యింది.
ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. ఇటీవలే ఆ సినిమాలోని పాట కోసం న్యూజిలాండ్ వెళ్ళొచ్చాడు. న్యూజిలాండ్ నుండి హైదరాబాద్ చేరుకున్న చరణ్ ఈరోజు ఓ ఈవెంట్ కోసం ఢిల్లీ వెళ్ళాడు.