యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాను కొట్టేసాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్. ఎన్టీఆర్ సినిమాను చరణ్ కొట్టేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయాలని రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎన్టీఆర్ కు కథ చెప్పాడు కూడా. బుచ్చిబాబు కథ నచ్చింది ఎన్టీఆర్ కు …. చేద్దామని అన్నాడు కూడా.
అయితే ఎన్టీఆర్ ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లకు కమిట్ అయి ఉన్నాడు. దాంతో మరికొన్నాళ్లు వెయిట్ చేయడం ఇష్టం లేని బుచ్చిబాబు రాంచరణ్ ను కలిసి కథ చెప్పగా వెంటనే ఓకే చేయడం జరిగిందట. దాంతో ఎన్టీఆర్ కు గుడ్ బై చెప్పి చరణ్ కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం విశేషం. ” దాంతో కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమౌతుంది ” అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలోకి వదిలారు. ప్రస్తుతం రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అయ్యాక బుచ్చిబాబు సినిమా లైన్ లోకి రానుంది. మొత్తానికి ఎన్టీఆర్ తో అనుకున్న సినిమా చరణ్ దగ్గరకు వెళ్లడంతో …… దీన్ని వదులుకొని ఎన్టీఆర్ తప్పు చేశాడా ? లేదా ? అన్నది బుచ్చిబాబు – చరణ్ ల సినిమా విడుదల అయితే కానీ తెలీదు.