మెగా కోడలు ఉపాసన సరోగసీ ( అద్దె గర్భం ) వార్తలకు చెక్ పెట్టింది. ఇటీవలే ఉపాసన – చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రకటించి సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నాళ్ళకెన్నాళ్లకెన్నాళ్లకు ……. అంటూ మెగా అభిమానులు పరవశించి పోయారు. ఎందుకంటే గత పదేళ్లుగా చరణ్ – ఉపాసన ల వారసుడి కోసం ఎదురు చూసున్నారు మెగా అభిమానులు.
అయితే ఉపాసన – చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ తెలిసింది కానీ ఆమె గర్భం దాలుస్తుందా ? లేక సరోగసీ కి వెళుతుందా ? అనే అనుమానాలు ఉండేవి. ఇక సోషల్ మీడియాలో అయితే సరోగసీ ద్వారానే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి. అయితే ఇలా ఎన్ని గాలివార్తలు వస్తున్నా ఉపాసన నుండి కానీ చరణ్ నుండి కానీ ఖండన రాలేదు.
కట్ చేస్తే ఉపాసన బేబీ బంప్ తో కూడిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేసి సరోగసీ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. తాజాగా ఉపాసన చరణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి థాయ్ లాండ్ కు వెళ్లారు. అక్కడ సందడి చేసిన సమయంలో తీసిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఉపాసన. ఆ ఫోటోలలో ఉపాసన బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో సరోగసీ వార్తలకు చెక్ పడినట్లే !