
ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళిని చంపడానికి స్కెచ్ వేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. బాలీవుడ్, హాలీవుడ్ లలోని మహామహులైన దర్శకులను వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టించిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పై పలువురు దర్శకులకు విపరీతమైన కోపం , కసి ఉన్నాయని దాంతో వాళ్ళు రాజమౌళిని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు వర్మ.
రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అయితే 4 పెగ్గులు వేసిన తర్వాత నేను ఈ మాటలు అంటున్నానని తేల్చేశాడు. అంటే మందు తాగి వాగానని చెప్పకనే చెబుతున్నాడన్న మాట. అయితే వర్మ ట్వీట్ సంగతి పక్కన పెడితే రాజమౌళి మీద మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నారు కొంతమంది దర్శకులు. ఒక్క ఓటమి కూడా లేకుండా వరుస విజయాలు సాధిస్తూ పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ప్రభంజనం సృష్టిస్తున్నాడు. దాంతో చాలా మందికి అసూయ కలుగుతోంది రాజమౌళి సాధిస్తున్న విజయాల పట్ల.
ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఆస్కార్ రేసులో నిలిచాడు జక్కన్న. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక వరుసగా పలు అవార్డులు కూడా వచ్చి పడుతున్నాయి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి. ఇప్పటికే నాటు నాటు అనే పాటకు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ లభించగా తాజాగా జపాన్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్ లభించడం విశేషం.