
డబ్బుల కోసం కాపువాళ్లను కమ్మోళ్లకు అమ్మాడని పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. నిన్న హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి దాదాపు 3 గంటల పాటు చర్చించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో మరోసారి సంచలనం కలిగించింది. ఇక ఈ భేటీ పై ఆనందం వ్యక్తం చేసేవాళ్ళు ఉన్నారు అలాగే తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు వస్తున్నాయి.
ఇక అవకాశం చిక్కితే చాలు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడే వ్యక్తి రాంగోపాల్ వర్మ. తాజాగా ఈ సంఘటనపై స్పందించాడు….. కాదు కాదు తీవ్ర విమర్శలు చేసాడు. డబ్బు కోసం కాపు వాళ్ళను కమ్మోళ్లకు అమ్మాడు. RIP కాపు ….. congrats కమ్మ అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేసాడు వర్మ.
పవన్ కళ్యాణ్ ని విమర్శించడంలో వర్మ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు చాలా కాలంగా. ఇక వర్మ పై పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా విరుచుకుపడుతున్నారు. వర్మ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా చంద్రబాబు – పవన్ కళ్యాణ్ లకు వ్యతిరేకంగా ఓ సినిమా తీసే పనిలో ఉన్నాడు ప్రస్తుతం దాంతో పవన్ కళ్యాణ్ పై మరింతగా విమర్శలు చేస్తున్నాడు.