టాలీవుడ్ స్టార్ హీరోలను పిచ్చ పిచ్చగా తిట్టి పడేసాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. తెలుగు సినిమా లెజెండ్ అయిన కృష్ణంరాజు చనిపోతే షూటింగ్ లు ఆపేసి ఆయనకు నివాళులు అర్పించడం చాలా సర్వసాధారణం. ఒకవైపు కృష్ణంరాజు చనిపోతే ……. మీరంతా షూటింగ్ లు చేసుకుంటూ ఉంటారా ? ఏదో ఒకరోజు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా అందరూ చనిపోతారు. ఇక్కడ ఎవ్వడు శాశ్వతం కాదు అంటూ తిట్ల వర్షం కురిపించాడు.
రాంగోపాల్ వర్మ ఇంతలా స్టార్ హీరోలను తిట్టడానికి కారణం ఏంటో తెలుసా……… ఈరోజు పలువురు స్టార్ హీరోలు ఎంచక్కా షూటింగ్ లు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు నెల రోజులకు పైగా షూటింగ్ లను ఆపేశారు. ఇప్పుడు మరో రోజు షూటింగ్ ఆపేసి కృష్ణంరాజు కు ఘన నివాళి అర్పించవచ్చు కదా …… మీరు కూడా ఏదో ఒకరోజు పోతారు తప్పదు కాకపోతే ముందు వెనుక అంతే ! అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వర్మ చెప్పిన దాంట్లో కూడా నిజమే ఉంది సుమా. మొన్నటి వరకు చర్చల పేరుతో షూటింగ్ లను ఆపారు. లెజెండ్ చనిపోతే మాత్రం షూటింగ్ లు చేస్తున్నారు. దాంతో ప్రభాస్ అభిమానులు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు టాలీవుడ్ స్టార్ హీరోల మీద.