మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన ప్రతీ సినిమాలో ఎవరో ఒక సీనియర్ హాట్ భామను కీలక పాత్రలో నటింప జేయడం కామన్. ఇప్పటికే పలు చిత్రాల్లో సీనియర్ హీరోయిన్ లను తీసుకొచ్చిన త్రివిక్రమ్ ఈసారి మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రకు హాట్ భామ రమ్యకృష్ణ ను తీసుకున్నట్లు సమాచారం. రమ్యకృష్ణ 90 వ దశకంలో స్టార్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. అంతేకాదు అప్పట్లో గ్లామర్ తార అంటే రమ్యకృష్ణ మాత్రమే…… గ్లామర్ హీరోయిన్ గా పలువురు భామలు పోటీ పడుతున్నప్పటికి అప్పట్లో ఈభామదే అప్పర్ హ్యాండ్.
ఇక తాజా విషయానికి వస్తే …… మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకుముందు అతడు , ఖలేజా చిత్రాలు వచ్చాయి. అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయినప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమా హక్కుల కోసం అటు డిస్ట్రిబ్యూటర్లు ఇటు నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీగానే పోటీ నెలకొంది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా మరొక హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తోంది. ఇక పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా బ్యాగ్రౌండ్ …… గుంటూరు నేపథ్యం అని తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో కూడా ఫ్యాక్షన్ ఉందనే విషయం తెలిసిందే. గుంటూరు రాజకీయాల నేపథ్యంలో, అలాగే ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.