మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చిత్రం ” రామారావు ఆన్ డ్యూటీ ”. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఆగస్టు 29 న విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం చవి చూసింది. ఒకప్పుడు హీరోగా నటించిన వేణు తొట్టెంపూడి చాలాకాలం తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.
అయితే అతడి ఆశలు కూడా ఆవిరి అయ్యాయి. రవితేజ నటించిన పలు చిత్రాలు గతకొంత కాలంగా విడుదల అవుతున్నాయి అలాగే ఘోర పరాజయం పొందుతున్నాయి. ఆ జాబితాలో ఈ రామారావు ఆన్ డ్యూటీ చిత్రం కూడా చేరింది. బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు. అయితే ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈరోజు నుండి ( సెప్టెంబర్ 15 నుండి ) సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.