మెగా హీరోలు రాంచరణ్ , అల్లు అర్జున్ లు హీరోలుగా భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. ఈ ఇద్దరి కోసం టైటిల్ కూడా ఖరారు చేసాడు ……. అంతేకాదు ఆ టైటిల్ ని ప్రతీ ఏడాది రెన్యూవల్ చేస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఆ మల్టీస్టారర్ చిత్రానికి టైటిల్ ఏంటో తెలుసా ……. చరణ్ – అర్జున్.
2014 లో ఎవడు అనే చిత్రంలో చరణ్ – అర్జున్ ఇద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే అందులో అల్లు అర్జున్ పాత్ర కేవలం కొంతసేపు మాత్రమే ఉంటుంది. పైగా అప్పుడు ఈ ఇద్దరు కూడా పెద్ద స్టార్స్ కాదు. అదే సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే రికార్డుల మోత మోగి ఉండేది.
చరణ్ తన మేనల్లుడు కావడంతో అతడితో కలిసి తన కొడుకు అల్లు అర్జున్ కలిసి నటిస్తే చూడాలని ఉంది అల్లు అరవింద్ కు. అందుకే చరణ్ – అర్జున్ అనే టైటిల్ ను పదేళ్లుగా రిజిస్టర్ చేయిస్తునే ఉన్నాడట. తప్పకుండా వాళ్ళిద్దరి కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ చిత్రం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పుడు చరణ్ – అర్జున్ ఇద్దరు కూడా పాన్ ఇండియా స్టార్స్ కావడంతో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. ఈ కాంబినేషన్ మెగా అభిమానులకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.