
ఈరోజు ఉదయం హీరో రాంచరణ్ లాస్ ఏంజెల్స్ వెళ్ళాడు. అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్న చరణ్ అమెరికా ఎందుకు వెళ్తున్నాడో తెలుసా ……. మార్చి 12 న లాస్ ఏంజెల్స్ లో జరుగనున్న ఆస్కార్ అవార్డుల కోసం చరణ్ వెళ్తున్నాడు. మార్చి 12 కు ఇంకా సమయం ఉంది. కానీ ఈలోపు మరిన్ని ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్లాన్ చేశారట జక్కన్న.
దాంతో దాదాపు 20 రోజుల ముందుగానే అమెరికా వెళ్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ చిత్రం లోని నాటు నాటు అనే పాట ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. నాటు నాటు అనే పాట ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతూనే ఉంది. ఒకవేళ నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వస్తే ……. ఆ వేదిక మీద ఎన్టీఆర్ , చరణ్ ఇద్దరు కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేయడం ఖాయమని తెలుస్తోంది.
ఇక చరణ్ ఇప్పుడు వెళ్ళాడు …… ఎన్టీఆర్ మాత్రం ఇప్పట్లో వెళ్లేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవలే తన సోదరుడు నందమూరి తారకరత్న చనిపోవడంతో పెద్ద కర్మ అయ్యాకే ఎన్టీఆర్ అమెరికా వెళ్లనున్నాడు. అంటే మార్చి మొదటి వారంలో ఎన్టీఆర్ అమెరికా వెళ్లనున్నాడన్నమాట. నాటు నాటు సాంగ్ కు కనుక ఆస్కార్ వస్తే భారతీయ చిత్రానికి అరుదైన గౌరవం లభించినట్లే ! ఆ రోజు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు భారతీయులు. అలాగే మెగా , నందమూరి అభిమానులు కూడా.