25.2 C
India
Tuesday, January 20, 2026
More

    యంగ్ డైరెక్టర్ కి షాక్ ఇచ్చిన రామ్ చరణ్

    Date:

    ఆర్ఆర్ఆర్ సినిమా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఊహించనంత స్టార్ డమ్ నే కాదు.. అదే సమయంలో కొన్ని పరిమితులను తీసుకొచ్చింది. ఇదే క్రేజ్ ను కాపాడుకోవాలంటే తన కెరీర్ లో ఇక ప్రయోగాలు చేయకుండా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ఆ అనుభవాన్ని ఎదుర్కొంటున్నాడు రామ్ చరణ్. పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మంచి సబ్జెక్టులను వదులుకోవాల్సి వస్తోంది. యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచి రామ్ చరణ్ తప్పుకోవడంపై తాజాగా భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి.

    RRRరిలీజ్ కు ముందు రామ్ చరణ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా ఓ ఈ ప్రాజెక్ట్ ప్రకటించాడు. అయితే ఆ సినిమా రిలీజ్ తరువాత చరణ్ క్రేజ్ పెరగడం.. పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీ దక్కడంతో సమీకరణాలు మారిపోయాయి. దీంతో గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథ పాన్ ఇండియా రేంజ్ తగదేమో అని చరణ్ తిరస్కరించాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు గౌతమ్. తాజాగా అనౌన్స్ మెంట్ పోస్టర్ ని చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ .. అనవసరంగా ఆ సినిమాను వదలుకున్నాడేమో అని బాధపడుతున్నారు. అయితే రామ్ చరణ్ దాన్ని కాదనుకోవడానికి వేరే కారణం ఉందని తెలుస్తోంది.

    RRRలో రామ్ చరణ్ పోలీస్ అధికారిగా కనిపిస్తాడు. అయితే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్లో కూడా పోలీస్ క్యారెక్టరే నని తెలుస్తోంది. పీరియాడిక్ నేపథ్యంలో సాగే కథ కావడం..అందులో చరణ్ పాత్ర పోలీస్ పాత్ర కావడంతో మరోసారి పీరియాడిక్ ఫిల్మ్ లో.. మళ్లీ పోలీస్ పాత్రలో నటించడం ఇష్టం లేకే చరణ్ రిజెక్ట్ చేశాడని అంటున్నారు. ఏదేమైనా రామ్ చరణ్ ఒక మంచి స్టోరీని మిస్ అయ్యాడేమో అని కాస్త బాధపడుతున్నారు ఫ్యాన్స్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular