
అన్నయ్య రమేష్ బాబు చనిపోయి అప్పుడే ఏడాది అయ్యింది. దాంతో అన్నయ్య సంవత్సరికాన్ని నిర్వహించాడు మహేష్ బాబు. గత ఏడాది 2022 జనవరి 8 న రమేష్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజేమో 2023 జనవరి 8 కావడంతో సంవత్సరికం నిర్వహించాడు. మహేష్ బాబు కు అన్నయ్య రమేష్ అంటే ఎనలేని గౌరవం , ప్రేమ.
అన్నయ్య రమేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాల్లో మహేష్ బాబు కలిసి నటించాడు. అందులో మాగ్జిమమ్ హిట్ కొట్టాయి. దాంతో చిన్నప్పుడే మహేష్ బాబు కు స్టార్ డం వచ్చింది. అన్నయ్య రమేష్ బాబు హీరోగా మంచి విజయాలు అందుకున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో స్టార్ డం పొందలేకపోయాడు.
దాంతో డిప్రెషన్ కు లోనయ్యాడు. ఇక అప్పటి నుండి కోలుకోలేకపోయాడు. అయితే అన్నయ్య అంటే అమితమైన ఇష్టం కావడంతో ఆయన్ని నిర్మాతగానైనా నిలబెట్టాలని కొన్ని ప్రయత్నాలు చేసాడు కానీ కుదరలేదు. అన్నయ నిర్మాతగా నిర్మించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. దాంతో అనారోగ్యంతో గత 2022 జనవరి 8 న మరణించాడు. అయితే అన్నయ్య మరణించిన సమయంలో మహేష్ కరోనాతో బాధపడుతున్నాడు. దాంతో అన్నయ్య రమేష్ బాబును కడసారి చూడలేకపోయాడు.