
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మహేష్ బాబు పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు త్రివిక్రమ్. ఈ చిత్రంలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.
ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో హాట్ భామ రమ్యకృష్ణ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ రమ్యకృష్ణ పోషించనున్న పాత్ర ఏంటో తెలుసా ……. మహేష్ బాబుకు అత్త పాత్రలో. అవును సీనియర్ హీరోయిన్ లను తన చిత్రాల్లో కీలక పాత్రల్లో నటింపజేయడం త్రివిక్రమ్ కున్న అలవాటు. ఇప్పటి వరకు టబు , నదియా , కుష్భు , పవిత్రా లోకేష్ ఇలా తదితరులను అమ్మ, అత్త పాత్రలోకి తీసుకున్నాడు.
ఇక అదే కోవలో తాజాగా సీనియర్ భామ రమ్యకృష్ణ ను మహేష్ బాబుకు అత్తగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకే స్క్రీన్ పై మహేష్ బాబు – రమ్యకృష్ణ లు కనిపిస్తే ఆ మజానే వేరు. పైగా అత్తా – అల్లుడు పాత్రల్లో అంటే మరింత రంజుగా ఉండటం ఖాయం. మహేష్ బాబు – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో అతడు , ఖలేజా వంటి చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం అవడంతో ఈ సినిమా తప్పకుండా భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు.