
రమ్యకృష్ణ చెన్నై లో ఉంటుంది నేను హైదరాబాద్ లో ఉంటున్నాను ……. చాలాకాలంగా మేమిద్దరం వేరు వేరుగానే ఉంటున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శకులు కృష్ణవంశీ. రమ్యకృష్ణ – కృష్ణవంశీ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ ఒక కొడుకు కూడా. అయితే చాలాకాలంగా రమ్యకృష్ణ చెన్నైలోనే ఉంటోంది. ఇక కృష్ణవంశీ హైదరాబాద్ లోనే ఉంటున్నాడు.
ఒకరక్కడ ఒకరిక్కడ అయితే కాపురం ఎట్లా అనే కదా ! మీ డౌట్. వాళ్ళు ఇప్పుడు కొత్త దంపతులు కాదు కదా ! అందుకే ఎప్పుడో ఒకసారి రమ్యకృష్ణ హైదరాబాద్ వస్తుంది ఆ తర్వాత చెన్నై వెళుతుంది అంతే ! ఇక షూటింగ్ ల కోసం ఎలాగూ అడపా దడపా హైదరాబాద్ కు వస్తూనే ఉంటుంది కదా ! ఇవే సమాధానాలు కృష్ణవంశీవి.
90 వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రమ్యకృష్ణ. అప్పట్లో చెన్నై లోనే ఉండేది తెలుగు చిత్ర పరిశ్రమ. అంతేకాకుండా రమ్యకృష్ణ తమిళనాడుకు చెందింది కాబట్టి అక్కడే స్థిరపడింది. ఎవరి దారిలో వాళ్ళు పయనించాలని , ఒకరి మీద మరొకరు పెత్తనం చేయొద్దని ముందుగానే కండీషన్ లు పెట్టుకున్నారు. దాంతో ఒకరి విషయాల్లో ఒకరు తలదూర్చరు. అదన్న మాట అసలు విషయం.