విక్టరీ వెంకటేష్ – రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ ” రానా నాయుడు ”. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ విడుదల చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. ఒక నిమిషం పాటు ఉన్న ఈ టీజర్ లో యాక్షన్ అదిరిపోయింది. అలాగే ఓకే ఫ్రేమ్ లో వెంకీ – రానా ఉండటంతో ఆ ఇద్దరినీ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు దగ్గుబాటి అభిమానులకు.
ఇక ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే వెంకటేష్ విభిన్న గెటప్ లో కనిపించడం. ఆ గెటప్ చూసి వెంకీ అభిమానులు థ్రిల్ ఫీలవ్వడం ఖాయం. ముంబై మాఫియా నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ రూపొందినట్లు తెలుస్తోంది. ఇక ఇది అమెరికన్ వెబ్ సిరీస్ అయిన ” రే డోనోవన్ ” కు రీమేక్. ఇక ఇది తెలుగులో లేదు సుమా ! కేవలం హిందీలో మాత్రమే రూపొందింది. అయితే వెంకీ – రానా ఇద్దరు కూడా తెలుగువాళ్లు కాబట్టి తెలుగులో డబ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు కరణ్ అన్షు మాన్ – సుపర్న్ ఎస్ వర్మ సంయుక్తంగా దర్శకత్వం వహించడం విశేషం.